శీర్షిక

నాకు నచ్చిన కథ కడుపులో కలకలం తీగల గోపీచంద్
సేకరణ టీవీయస్.శాస్త్రి
బొమ్మలు రామకృష్ణ

అనగా అనగా,'పొట్టారాజ్యంలో 'జీర్ణకోశ' పట్టణం ఉంది.అదే పొట్టారాజ్యాని కంతటికీ రాజధాని.దానిలోనే   రాజ్యాన్నిఅంతా పరిపాలించే 'పెద ప్రేగు'మహారాజు నివసించేవాడు.'ఆకలయ్య'అనే మహా మంత్రి,'అన్నంరాజా'అనే సేనాధిపతులు కూడా రాజుకు అండగా ఉండి  పొట్టారాజ్యాన్ని నిర్భయంగా  ఏలుతున్నారు.ఇట్లా ఉంటుండగా, రాజ్యంలోకి'కాఫీ దొరగారు'అనే వర్తకుడు ప్రవేశించా
డు.వాడు 'పెద ప్రేగు' మహారాజు వద్దకు వచ్చి,"మేము వర్తకం చేసుకుందామని తమ దేశానికి వచ్చాం.మాకు కొంచం స్థలం ఇవ్వండి."అని ప్రాధేయ పడ్డాడు.అప్పుడు రాజుగారు  వర్తకులను,వారివద్దనున్న వస్తువలను చూసి సంతోషించి,వారికి కొంత స్థలం ఇచ్చారు.ఇట్లా రోజురోజుకీ కాఫీదొరలు వచ్చి అనేక స్థలాలు ఆక్రమిస్తున్నారు.అప్పుడు ఆకలయ్య మహామంత్రి రాజు గారితో,"అట్లా కొత్త వారికి చోటిస్తే ప్రమాదం,"అని చెప్పాడు.అప్పుడు రాజు గారికి కోపం వచ్చి ."నాకు నీతులు చెప్పటానికి నీవెవ్వరవు? నా రాజ్యం నుంచి వెళ్ళిపో!"అన్నారు.అప్పుడు మంత్రిగారు చేసేది ఏమీలేక ఇంకో రాజ్యంలోకి వెళ్లారు.ఇంకేం!
కాఫీ దొరలు ఆడింది ఆట పాడింది పాటగా ఉంది.కానీ, మధ్యమధ్య  'అన్నంరాజా'అడ్డు తగులుతున్నాడు.అందుకని.కాఫీ దొరలు మహారాజుకీ,అన్నంరాజా కీ మధ్య పోట్లాట సృష్టించారు.పాపం! రాజు గారు అన్నంరాజును కూడా వెళ్ళగొట్టారు.అన్నంరాజు గారు, ఆకలయ్య గారిని కలుసుకొని జరిగినదంతా చెప్పాడు.ఇద్దరూ కలసి యుద్ధ సన్నాహాలు చేస్తున్నారు.ఇక్కడ, కాఫీ దొరలు పెదప్రేగు మహారాజుని బంధించి జైల్లో పెట్టి పొట్టా రాజ్యంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నారు.రోజురోజుకీ వారి దుండగాలు ఎక్కువ అవుతున్నాయి.రోజుకొక  గ్రామాన్ని దోచేస్తూ, గ్రామ ప్రజలను అన్యాయంగా చంపేస్తూ,స్త్రీలను కూడా హింసిస్తున్నారు. ఇలా కాఫీ దొరలు దొరికిన డబ్బంతా దోచుకెళ్ళుతున్నారు.అప్పుడు ప్రజలు ఆకలయ్య గారి వద్దకు వెళ్లి తమ కష్టాలను విన్నవించుకున్నారు. అప్పుడు,ఆకలయ్య గారు పెద్ద సైన్యంతో కాఫీ దొరల మీదికి యుద్ధానికి వెళ్ళాడు.ఇది గమనించి,కాఫీ దొరలు భయపడి'వాంతి'అనే రహస్య మార్గం గుండా పారిపోయారు.

( -- 
రచన,తీగలగోపీచంద్ -
1947లో ఆయనకు 16 ఏండ్ల వయసులో,అయిదవ ఫారం చదువుతుండగా వ్రాసిన ఈ బ్రహ్మాండమైన కథ 1947 ఆంద్ర పత్రికలో ప్రచురితమయ్యింది. రచయిత ప్రస్తుత వివరాలు తెలియవు.ఎవరైనా తెలియజేస్తే సంతోషిస్తాను.)
------------

9 comments:

  1. దేశ స్వాతంత్ర్యము కోసం తెల్ల దొరలను పారద్రోలినట్లు కాఫీ దొరలను పారద్రోలడం బాగుంది.
    ఈ కథ అప్పటి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వుంది.

    ReplyDelete
  2. కథ చాలా బాగుంది .

    ReplyDelete
  3. తీగల గోపీచంద్ సైన్స్ మరియు హాస్యం మేళవించి చక్కటి కధను అల్లారు. ధన్యవాదములు శాస్త్రి గారు

    ReplyDelete
    Replies
    1. చిన్న కథ. చాలా బాగుందండి.

      Delete
  4. పదహారేళ్ళప్రాయంలో గమ్మత్తయిన ఇలాంటి కధను - ఆ(1947)నాటి రాకీయనేపధ్యాన్ని దృష్టిలోనుంచుకుని, చదువరులనాసక్తిపరిచేలా - రాయడం రచయిత(శ్రీ తీగల గోపీచంద్)కు వయసుకుమించిన ఆలోచనాశక్తి ఉందనడానికి నిదర్శనం; దీన్ని "సృజన" ద్వారా పాఠకులకందించిన శ్రీ టి. వి.ఎస్. శాస్త్రిగారికి కృతజ్ఞతలు.

    -మొహమ్మద్ అబ్దుల్ వహాబ్.

    ReplyDelete
  5. DEAR SIR , I READ YOUR COFFEE STORY . IT IS VERY WELL . RECENTLY ONE CINE POET WRITE A '' DANDAKAM ''' ON COFFEE . IT WAS READ BY THE WRITER IN SRI SP BALA SUBRAHMANYAM PROGRAM PADUTHA THEEYAGA . IT IS VERY NICE . ANY HOW CONGRATULATIONS TO YOU , SINCE ENLIGHTEN THE STORY OF SRI GOPICHAND .

    ReplyDelete
  6. " కడుపులో కలకలం "

    కధ వాస్తవ సుఖజీవనానికి చాలా దగ్గఱగా వున్నది . ఇది ఏ ఒక్కరికో సంబంధించినది కాదు . అందఱూ ఆలోచించవలసినదే . సింబాలిజంగా చెప్పటం ఎంతొ రమ్యంగా వున్నది .
    అంతే కాకుండా ఆ రోజుల్లోనే ( 1947 లోనే ) నిజానికి నేనప్పటికి జన్మ తీసుకోనేలేదు .
    నాకు ఇంతటి మంచి కధను తమకు నచ్చిన కధగా పరిచయం చేసిన శాస్త్రి గారికి నా అభివందనములు .

    ReplyDelete