కవితలు

నువ్వే

రచయిత ఎస్ కె వి రమేష్
బొమ్మలు రామకృష్ణ





జ్ఞాపకం గా నిన్ను సాధించుకున్నాను కదా!
వేదనైనావేడుకైనానువ్ లేనిదే
నాలో పూర్ణత సాధించదుగా ఇక
*******
గమ్యాలను గౌరవించడం నేర్చాను నేను
అక్కడ గారంగా నన్ను పిలిచే
నీ పిలుపులు వినబడుతుంటే!
గాయాలకు నవ్వడమూ నేర్చాను నేను
ఆనక లేపనాన్ని పూసే నీ పలుకులను వలచి
*********
అదృష్టానికి అంగరక్షకులుగా
 నా కనురెప్పలు మారేదెపుడో చెప్పనా!
చిరునవ్వుల కాంతిలో!
నా కాంతగా నువ్వు నా ఏకాంతాన్ని ఏలేవేళ

-------------

చీకటి బ్రతుకు

రచయిత వజ్ర దీప్
బొమ్మలు రామకృష్ణ



మనిషిగా నీ జీవితం ఒక వెలుగుల బ్రతుకు
మనస్సుతో చూస్తే నీ జీవన రాగంలో చీకటి .
నువ్వు అనే నీ దేహం ఒక వెలుగు
కనిపించే నీ నీడ ..నీ చీకటి .. అదే నీ మనస్సు
డబ్బులను వెతుక్కుంటూ  జీవితాన్ని ఆశతో బ్రతుకుతున్నాం
మబ్బులను ( డబ్బులను) తొలగించి ఆనందాల ప్రపంచానికి ప్రయాణించే దారి ఎక్కడ ఉంది?
నీకు నచ్చే నీ కళ.. కలగానే కళాత్మకంగా నిద్రలో బ్రతికేస్తు ఉంది
నీ కళకు జీవం పోసే ఉషోదయం ఎప్పుడు వస్తుంది...?
నువ్వుగా నడిచే బ్రతుకు బండిని స్వార్ధం,పరువు అనే ఫలాలతో ఆశగా బ్రతుకుతు..
నేనుగా నడిచే మనస్సుని ఆశతో ఆలింగనం చేసే ప్రయత్నపు ప్రయాణం  అంధకారంలో జీవిస్తునే ఉంది
*****






No comments:

Post a Comment